waqf property :వక్ఫ్ భూముల్ని పరిరక్షించాలంటూ.. ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి.. షేక్ ఖాజావలి హైకోర్టులో పిల్ వేశారు. జిల్లా వక్ఫ్ ఆస్తుల కమిటీల ఏర్పాటు కోసం గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అమలు చేసేలా... రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
hc on waqfproperty:వక్ఫ్ భూముల్ని పరిరక్షించాలంటూ హైకోర్టులో పిల్ - high court latest news
waqf property: వక్ఫ్ భూముల్ని పరిరక్షించాలంటూ.. ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి.. షేక్ ఖాజావలి హైకోర్టులో పిల్ వేశారు. జిల్లా వక్ఫ్ ఆస్తుల కమిటీల ఏర్పాటు కోసం గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను అమలు చేసేలా... రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.
గతంలో జారీ చేసిన జీవోల ప్రకారం.. జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లాస్థాయి ఇతర అధికారులతో వక్ఫ్ పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేసి.. నెలకోసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఆక్రమణలు జరిగి ఉంటే.. వాటిని తొలగించి.. ఆ ఆస్తుల నిషేధిత జాబితా తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు చర్యలు లేవన్నారు. దీంతో కోట్ల రూపాయలు విలువ చేసే.. వేల ఎకరాల వక్ఫ్ ఆస్తులు ఆక్రమణలో ఉన్నాయన్నారు. కమిటీలు పనిచేసేలా ఆదేశించాలని కోర్టును కోరారు.
ఇదీ చదవండి: