ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లాక్‌డౌన్‌: మూగజీవాల పరిస్థితి మరీ ఘోరం

లాక్‌డౌన్‌తో మూగజీవాల పరిస్థితి ఘోరంగా తయారైంది. భాగ్యనగరంలో భారీ సంఖ్యలో ఉన్నపావురాలు ఆహార గింజలు దొరక్క విలవిల్లాడుతున్నాయి. నగరంలోని మాదాపూర్‌ ప్రధాన మార్గంలో ఉన్న వినాయక విగ్రహం వద్ద.. పూజ చేసి పెట్టిన అక్షతలు తింటూ కడుపు నింపుకుంటున్నాయి.

v
మూగజీవాల పరిస్థితి మరీ ఘోరం

By

Published : Apr 17, 2020, 5:27 PM IST

లాక్‌డౌన్‌ పశుపక్ష్యాదులకు కష్టకాలంగా మారింది. అసలే లాక్‌డౌన్‌... దానికితోడు రోజురోజుకు ముదురుతున్న ఎండలు. భాగ్యనగరంలో పావురాలు ఎక్కువ. సాధారణ రోజుల్లో చాలామంది వీటికి గింజల్ని వెదజల్లుతుంటారు. కేబీఆర్‌ పార్క్‌, చార్మినార్‌, ట్యాంక్‌బండ్‌, గోల్కొండ ఇలా రాజధాని నగరంలో ఎక్కడ చూసినా కనిపించేవి కపోతాలే.

తాజా పరిస్థితులు వలస కార్మికులకే కాదు.. పక్షుల పొట్ట కూడా కొట్టాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆహారం దొరక్క పావురాలు విలవిల్లాడుతున్నాయి. వందల సంఖ్యలో ఉన్న కపోతాలకు ఆహార గింజలు కరువయ్యాయి. నగరంలోని మాదాపూర్‌ ప్రధాన మార్గంలో ఉన్న వినాయక విగ్రహం వద్ద.. పూజ చేసి పెట్టిన అక్షితలు తింటూ కడుపు నింపుకుంటున్నాయి.

ఇదీ చదవండి:ఆపత్కాలంలో 'ఆమె'కు అండగా షీటీం బృందాలు

ABOUT THE AUTHOR

...view details