తెెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో జాతర సందర్భంగా పందుల (వరాహాల) పోటీలు నిర్వహించారు. ఈ పందాలు ఐజ పట్టణంలో జరిగాయి. తిక్కవిరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులు, ప్రజల వినోదం కోసం వివిధ రకాల పోటీలను నిర్వహిస్తారు. అందులో వరాహాల పందాలను శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీలను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు.
తెలంగాణ: అలంపూర్ జాతరలో పందులు, శునకాల పోటీలు
జాతరలు, పండుగల్లో కోడి పందాలు, ఎద్దులు బండలు లాగే పోటీలు చూశాం.. పొట్టెళ్ల పోటీలు నిర్వహించడం తిలకించాం. కానీ అందుకు భిన్నంగా పందులు, శునకాల పోటీలను నిర్వహించడం ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చుశారా? అది ఎక్కడో చూడాలని ఆసక్తిగా ఉందా? అయితే ఆ ఊరిపై ఓ లుక్కెయ్యండి.
అలంపూర్ జాతరలో పందుల పోటీలు
వరాహాల పోటీలతో పాటు శునకాల పరుగు పందెం నిర్వహించారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సుమారు 46 శునకాలు పోటీల్లో పాల్గొన్నాయి.
ఇదీ చూడండి: