మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుపై కృష్ణా జిల్లాలోని ఆత్కూరుకు చెందిన సొంగ దేవదాస్ నాయుడు రాజస్థాన్‌లోని చురులో ఉన్న ఓం ప్రకాష్ జోగీందర్ సింగ్ (ఓపీజేఎస్) యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ చేశారు. ‘శ్రీ నారా చంద్రబాబు నాయుడు- ఎ రోల్ మోడల్’ అన్న అంశంపై తాను సమర్పించిన పరిశోధన పత్రాన్ని యూనివర్సిటీ ఆమోదించి ఈ నెల 23న ప్రొవిజినల్ సర్టిఫికెట్ అందజేసిందని, అక్టోబరులో జరిగే స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ పట్టా ప్రదానం చేస్తుందని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దేవదాస్ ప్రస్తుతం రాంచీలోని ఎస్‌డీఏ హయ్యర్ సెకండరీ స్కూలు ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. ‘నాకు మొదటి నుంచి చంద్రబాబు అంటే ఎంతో ఇష్టం. ఆయన ఆలోచన విధానం, పాలనా దక్షత నన్ను ఎంతో ఆకర్షించాయి. అందుకే ఆయనపై పరిశోధన చేశా’ అని దేవదాస్ తెలిపారు.
phd on chandra babu: చంద్రబాబుపై పీహెచ్‌డీ చేసిన కృష్ణా జిల్లా వాసి - phd latest news
కృష్ణా జిల్లాకు చెందిన సొంగ దేవదాస్ నాయుడు అనే వ్యత్తి తెదేపా అధినేత చంద్రబాబుపై పీహెచ్‌డీ పూర్తి చేశారు. రాజస్థాన్‌లో ఉన్న ఓం ప్రకాశ్ జోగీందర్ సింగ్ విశ్వవిద్యాలయంలో పట్టా తీసుకున్నారు. తనకు మొదటి నుంచి చంద్రబాబు అంటే ఎంతో ఇష్టమని.. అందుకే ఆయనపై పీహెచ్‌డీ చేసినట్లు దేవదాస్ చెప్పారు.
phd on chandra babu