ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Petrol rates hike: మళ్లీ పెరిగిన చమురు ధరలు..ఎంతంటే.. - గుంటూరులో చమురు ధరలు

రాష్ట్రంలో చమురు ధరల పెంపు కొనసాగుతోంది. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 8 పైసలు పెరిగింది. గుంటూరులో లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.107.42గా ఉంది.

PETROL RATES IN AP
PETROL RATES IN AP

By

Published : Jun 24, 2021, 10:08 AM IST

రాష్ట్రంలో పెరుగుతున్న చమురు ధరలు సామాన్యులకు నిద్రపట్టనివ్వడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్ల పెట్రోల్​ ధర ఇప్పటికే వంద రూపాయలు దాటింది.

తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 26 పైసలు, డీజిల్‌పై 8 పైసలు పెరిగింది. ఈ మేరకు ప్రస్తుతం గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.96, డీజిల్‌ రూ.98.01 ఉండగా.. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.107.42గా ఉంది. అలాగే విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.103.76, డీజిల్‌ రూ.97.91 ఉండగా.. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.107.22గా ఉంది.

ఇదీ చదవండి:విశాఖలో రామ్​కీ ఫార్మా సిటీ విస్తరణకు కసరత్తు

ABOUT THE AUTHOR

...view details