Petrol Bunk workers Attack on Customer: పెట్రోల్ తక్కువగా వచ్చిందని ప్రశ్నించిన వాహనదారుడిపై పెట్రోల్ బంక్ సిబ్బంది పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్(ఐఓసీ) బంకు వద్ద ఈ ఘటన జరిగింది. గుణదల ప్రాంతానికి చెందిన వర్మ.. బంక్‌లో రూ.150 ఇచ్చి పెట్రోల్ పోయించాడు. ఈ క్రమంలో పెట్రోల్ తక్కువగా వచ్చిందని.. రూ.150కి లీటర్ కూడా రాలేదంటూ బంక్ సిబ్బందిని ఆయన ప్రశ్నించాడు. దీంతో సిబ్బంది మూకుమ్మడిగా వర్మపై దాడి చేశారు. దీంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చాడు. అయితే.. ఐఓసీ బంకులో వాహనదారుడిపై దాడి నేపథ్యంలో బంక్‌ను డీఎస్వో తనిఖీ చేశారు. అక్కడ ఉన్న సీసీ టీవీలో ఘటన దృశ్యాలను పరిశీలించారు. పోలీసులు.. ఇరువర్గీయులను విచారించారు.
పెట్రోల్ బంక్‌లో గొడవ.. కస్టమర్‌పై దాడి.. సిబ్బంది ఏమన్నారంటే? - Petrol bunk staff attack on motorist
15:28 April 24
రామవరప్పాడులో కస్టమర్‌పై పెట్రోల్ బంక్ సిబ్బంది దాడి
మూకుమ్మడి దాడి అవాస్తం:వాహనదారుడి మీద దాడి ఘటనపై బంక్ యాజమాన్యం స్పందించింది. కస్టమర్‌పై మూకుమ్మడి దాడి అనేది నిజం కాదని.. అతని స్పృహ తప్పిపడిపోయాడనటంలోనూ వాస్తవం లేదని తెలిపింది. 'వాహనదారుడు.. ఉదయం 8.42కి వచ్చి రూ.150 పెట్రోల్ తీసుకెళ్లాడు. అనంతరం 10.30 గంటలకు మళ్లీ వచ్చి పెట్రోల్ తక్కువగా ఉందంటూ వాదనకు దిగారు. ఈ క్రమంలో పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్న అమ్మాయిని అసభ్యకర పదజాలంతో దూషించాడు. మూకుమ్మడి దాడి అనేది నిజం కాదు. తన తప్పును ఒప్పుకున్న వాహనదారుడు.. తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడు' అని యాజమాన్యం వెల్లడించింది.
ఇదీ చదవండి:
TAGGED:
petrol bunk