పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచిన రాష్ట ప్రభుత్వం.. ఎంతంటే?
18:50 July 20
పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై రూ.1.24, డీజిల్‌పై 93 పైసలు వ్యాట్ పెంచింది.
పెట్రోల్‌పై రూ. 1.24, డీజిల్‌పై రూ.0.93 చొప్పున పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ వ్యాట్ చట్టం 2005ను సవరించింది. పెట్రోలుపై 31 శాతం పన్నుతోపాటు 4 రూపాయలు అదనంగా సుంకం విధిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌తో పాటు 4 రూపాయలు అదనంగా సుంకం విధించినట్టు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
కోవిడ్ కారణంగా రావాల్సిన ఆదాయం పడిపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా కారణంగా 4480 కోట్ల మేర రావాల్సిన రెవెన్యూ ప్రస్తుతం 1323 కోట్లు మాత్రమే వచ్చిందని ఈ కారణంగా పెట్రోలు, డీజిల్ ఉత్పత్తులపై వ్యాట్ సవరించిక తప్పని పరిస్థితి నెలకొన్నట్టు ప్రభుత్వం వివరించింది. ఏపీ కంటే పొరుగు రాష్ట్రాల్లో ఈ వ్యాట్ అధికంగా ఉన్నట్టు తెలిపింది. ప్రస్తుత పెంపుదల 2015-18 సంవత్సరాల మధ్య వసూలు చేసిన ప్రకారమే ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. వాళ్లకే ఛాన్స్