గుంటూరులో తెదేపా కార్యాలయానికి భూ కేటాయింపుపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. భూ కేటాయింపులో సీఆర్‌డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కేసులో తుది వాదనలను గురువారం వింటామన్న జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్..తదుపరి విచారణ ఈ నెల 15కి వాయిదా వేశారు.
తెదేపా కార్యాలయ నిర్మాణంపై సుప్రీం కోర్టులో విచారణ - తెదేపా కార్యాలయ నిర్మాణంపై సుప్రీం కోర్టులో పిటిషన్ తాజా వార్తలు
గుంటూరులో తెదేపా కార్యాలయానికి భూ కేటాయింపుపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి. భూ కేటాయింపులో సీఆర్‌డీఏ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.

తెదేపా కార్యాలయ నిర్మాణంపై సుప్రీం కోర్టులో పిటిషన్