ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 9, 2021, 5:55 PM IST

ETV Bharat / city

ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌

ఎస్​ఈసీగా నీలం సాహ్నిని నియమించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్​పై.. హైకోర్టులో వాదనలు జరిగాయి. న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్​లో పెట్టింది.

Petition in the High Court challenging the appointment of Neelam Sahni as SEC
ఎస్‌ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా నీలం సాహ్నిని నియమించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్​పై హైకోర్టులో వాదనలు జరిగాయి. సాహ్ని నియామకంపై విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది రేగు కాంతారావు హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. నేడు తుది వాదనలు వినిపించారు.

ప్రభుత్వంతో సంబంధం లేకుండా, నిష్పక్షపాతంగా ఉండే వ్యక్తిని ఎన్నికల కమిషనర్​గా నియమించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్​ తరఫు న్యాయవాది గుర్తు చేశారు. వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్​లో పెట్టింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details