ఒంగోలు - కర్నూలు రోడ్డులో వైఎస్ విగ్రహ ఏర్పాటును ఆపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విగ్రహ ఏర్పాటు విషయంలో సుప్రీం కోర్టు నిబంధనలు, రాష్ట్ర జీవోలను పట్టించుకోలేదని పిటిషనర్ వ్యాజ్యంలో పేర్కొన్నారు.
పిటిషన్ను విచారించిన న్యాయస్థానం.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విగ్రహం ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేసింది. పిటిషన్పై కౌంటర్ వేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ.. విచారణ 2 వారాలకు వాయిదా వేసింది.