జీవీఎంసీ పరిధిలో వాలంటీర్లు అధికారిక ఫోన్లు దుర్వినియోగం చేస్తున్నారని.. పుర ఎన్నికలు ముగిసే వరకు వాటిని సీజ్ చేయాలని కోరుతూ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో పిటిషన్ వేశారు. అధికార పార్టీ అభ్యర్థులకు ఓట్లేయాలని వాలంటీర్లు ప్రలోభపెడుతున్నారని తెలిపారు. ప్రజా సేవకులైన వాలంటీర్లు తటస్థంగా వ్యవహరించకుండా అధికార పార్టీకి మద్దతుగా వ్యవహరించడం చట్ట విరుద్ధమన్నారు. వాదనలు విన్న న్యాయస్థానం వివరాలు సమర్పించాలని ప్రతివాదులను ఆదేశించింది. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
'ఓటర్లను వాలంటీర్లు ప్రలోభపెడుతున్నారన్న అంశంపై పూర్తి వివరాలు సమర్పించాలి' - జీవీఎంసీలో ఓటర్లకు వార్డు వాలంటీర్ల వార్నింగ్ వార్తలు
విశాఖ కార్పొరేషన్ పరిధిలోని అధికార పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయకపోతే.. సంక్షేమ పథకాలు నిలిపేస్తామంటూ.. వాలంటీర్లు బెదిరిస్తున్నారని దాఖలైన వ్యాజ్యంపై.. హైకోర్టు స్పందించింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి , జీవీఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది.
petetion on ward volunteers in ap high court