పరిపాలన వికేంద్రీకరణ- మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులను రాష్ట్ర శాసనసభ మెున్నటి సమావేశాల్లో ఆమోదించింది. గతంలోనూ ఈ బిల్లులను శాసనసభ ఆమోదించినా, మండలి వ్యతిరేకించింది. వాటిని సెలెక్ట్ కమిటీలకు పంపాలని కోరింది. నాటి గందరగోళం మధ్యే బిల్లుల్ని సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్లు మండలి ఛైర్మన్ ఎం.ఎ.షరీఫ్ ప్రకటించారు. ఇది కోర్టుకు కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో.. మళ్లీ అవే బిల్లుల్ని యథాతథంగా శాసనసభలో ప్రవేశపెట్టి ప్రభుత్వం ఆమోదించింది. అయితే సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుపై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుపై హైకోర్టులో పిటిషన్
సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఈ పిటిషన్ను వేశారు.
petetion filed on crda cancellation bill in high courtpetetion filed on crda cancellation bill in high court