ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

PERNI NANI: 'జల వివాదానికి గత సీఎం చంద్రబాబే కారణం'

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకపోవడమే ప్రస్తుత నీటి వివాదాలకు కారణమని మంత్రి పేర్ని నాని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదంపై చంద్రబాబు తన వైఖరి తెలపాలని డిమాండ్​ చేశారు.

PERNI NANI ON CHANDRABABAU
జల వివాదానికి గత సీఎం చంద్రబాబే కారణం

By

Published : Jul 14, 2021, 9:50 PM IST

Updated : Jul 14, 2021, 10:02 PM IST

జల వివాదంపై మాట్లాడుతున్న పేర్ని నాని..

రాష్ట్రంలో ప్రస్తుతం కృష్ణా జలాల వివాదానికి చంద్రబాబు నాయుడే(CHANDRA BABU NAIDU) కారణమని మంత్రి పేర్ని నాని(PERNI NANI) ఆరోపించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలోనే తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై దిండి, పాలమూరు-రంగారెడ్డి అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోలేదన్నారు. దీనివల్లే నేడు నీటి ఇబ్బందులు వచ్చాయన్నారు. కృష్ణానదీ జలాల విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) దుర్మార్గాలు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీగా తన వైఖరేంటో చంద్రబాబు ఎందుకు చెప్పడం లేదని పేర్ని నాని నిలదీశారు. రాజకీయ నేతగా, రాష్ట్రానికి ప్రతిపక్షనేతగా చెప్పుకునే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన అన్నారు.

తన హయాంలో రాయలసీమకు నీరిచ్చానని చెప్పుకుంటున్న చంద్రబాబు.. ఎక్కడిచ్చారో చెప్పాలని నాని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలోనే కృష్ణా డెల్టా ఒక్క పంటకే నీరు పరిమితమైందన్నారు. వైకుంఠపురం బ్యారేజీకి చంద్రబాబు హయాంలో ఒక్క రాయైనా వేశారా అని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దు చేస్తానని సీఎం జగన్(CM JAGAN) మాట ఇచ్చి తప్పారని చంద్రబాబు ఆరోపిస్తున్నారన్న మంత్రి.. 20 నెలల పాలనలోనే ఎన్నికల్లో ఇచ్చిన 90 శాతం హామీలను సీఎం జగన్ నెరవేర్చారని తెలిపారు. రాబోయే 3 ఏళ్లలో మేనిఫెస్టోలోని మిగిలిన హామీలను కూడా ముఖ్యమంత్రి నెరవేరుస్తారని పేర్కొన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో చాలా వాటిని అమలుపరచలేదని ఆక్షేపించారు. వాటికి సమాదానం చెప్పాలని పేర్ని నాని నిలదీశారు.

Last Updated : Jul 14, 2021, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details