కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరిగిపోతోంది. కొవిడ్ రోగులు చాలామంది ఆక్సిజన్ అందక మృత్యువాత పడుతున్నారు. మృతదేహాలతో శవాగారాలు నిండిపోతున్నాయి. విజయవాడలోని కొవిడ్ ఆస్పత్రిలో మార్చురీ వద్ద రోజూ ఉదయాన్నే తమ వారి మృతదేహాల కోసం బంధువులు పడిగాపులు కాస్తున్నారు. సీరియల్ నంబరు ఇవ్వడానికి, పంచనామా జరగడానికి ఎక్కువ సమయం పడుతోంది. ఆఖరిచూపు కోసం మృతదేహాల మీద కప్పిన కవరు పైనుంచే చరవాణిలో ఫొటోలు తీసుకుంటున్నారు.
చివరిచూపు కోసం ఆరాటం.. చరవాణిలో ఫొటోలు
రెండవ దశలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. పాజిటివ్ కేసులతో పాటు మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు ఎక్కువ సమయం పడుతోంది. చివరి చూపు కోసం బంధువులు పడే ఆరాటం కలచివేస్తోంది.
చివరిచూపు కోసం బంధువుల ఆరాటం