ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్​ పరీక్షల​ కోసం.. నగర వాసులు అవస్థలు - vijayawada updates

కరోనా నిర్ధరణ పరీక్షల కోసం విజయవాడ ఇండోర్ స్టేడియంలో నగర వాసులు బారులు తీరారు. ఉదయం నుంచి క్యూలో వేచి ఉన్నా... పరీక్ష నిర్వహణపై ఎవరి నుంచి ఎటువంటి స్పందన లేదని.. బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

no corona test
కరోనా నిర్ధారణ పరీక్షల కోసం నిరీక్షణ

By

Published : Apr 15, 2021, 4:30 PM IST

విజయవాడ నగర వాసులు ఇండోర్ స్టేడియంలో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం బారులు తీరారు. చాలాసేపటి వరకు అధికారులు పరీక్షలు చేయని కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం పరీక్షలు చేస్తారో లేదో అన్న సమాచారం ఇవ్వలేదని బాధితులు అసహనం వ్యక్తం చేశారు.

నిన్న పరీక్ష చేయించుకోవడానికి వెళ్తే.. సమయం అయిపోయిందని ఈరోజు మళ్లీ రావాలని అధికారులు తెలిపారని నగరవాసులు చెబుతున్నారు. నేటి ఉదయం నుంచి క్యూలో నిల్చున్నా ఎవరూ స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details