విజయవాడ గులాబీతోటలో చిట్టీల నిర్వాహకుడు పరారయ్యాడు. చిట్టీల పేరుతో మోసం చేసిన రామారావు నుంచి తమ డబ్బులు ఇప్పించాలని కోరుతూ సుమారు 100 మంది బాధితులు రోడ్డుపై బైటాయించి ఆందోళనకు దిగారు.
విజయవాడ భానునగర్ కు చెందిన రామారావు అనే వ్యక్తి స్థానికంగా ఉంటూ.. చిట్టీల పేరుతో స్థానికుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. తిరిగి చెల్లించకపోవటంతో బాధితులు గతంలో సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లో నిందితుడ్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత బాధితులు తమ డబ్బులు ఇవ్వాలని కోరుతూ హటాత్తుగా బీఆర్టీఎస్ రోడుపై బైటాయించారు. భారీ ఎత్తున బాధితులు రావటంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి బాధితులకు నచ్చజెప్పి పంపించారు. సుమారు రూ. 12 కోట్ల సొమ్ము నిందితుడు బాధితులకు బకాయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.