వైఎస్సార్ పింఛను కానుక పథకం కింద సామాజిక భద్రత పింఛన్లను రాష్ట్రవ్యాప్తంగా 58,08,404 మందికి గాను తొలిరోజు సాయంత్రం 6 గంటల వరకు 54,50,000(95%)మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కరోనా వైరస్ ప్రభావంతో బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయటంతో గ్రామ వాలంటీర్లు లబ్ధిదారుల ఫొటోను తీసి వారికి పింఛను మొత్తాన్ని ఇచ్చారు. దీనికోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్ను వినియోగించి అక్రమాలకు చెక్ పెట్టినట్లు అధికారులు తెలిపారు. 23,230 మంది లబ్ధిదారులకు వారి సొంత గ్రామాలతో సంబంధం లేకుండా వారు ఏ గ్రామంలో ఉంటే అక్కడే పింఛను అందజేశారు. పెన్షన్ల పంపిణీలో రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అధికారులు, ఉద్యోగులు భాగస్వామ్యులయ్యారని ప్రభుత్వం తెలిపింది.
ఒక్కరోజులో 54.5 లక్షల మందికి పింఛన్లు పంపిణీ - వైఎస్సార్ పింఛను కానుక వార్తలు
లాక్డౌన్ అమల్లో ఉన్నప్పటికీ రాష్ట్రంలో బుధవారం ఒక్కరోజే 95 శాతం పింఛన్లను ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ ప్రభావంతో బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయటంతో గ్రామ వాలంటీర్లు... లబ్ధిదారుల ఫొటోను తీసి వారికి పింఛను మొత్తాన్ని ఇచ్చినట్లు తెలిపింది.
pensions distributed for 54.5 lakh people in one day