Pending cases: హైకోర్టులో నమోదైన పెండింగ్ కేసుల్లో.. ప్రభుత్వం ప్రతివాదిగా ఉన్న కేసులే అత్యధిక భాగం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2022 జూలై 15 నాటికి.. హైకోర్టులో 2 లక్షల 35,617 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు.. కేంద్ర న్యాయశాఖ రాజ్య సభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. అందులో 2 లక్షల కేసులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదిగా ఉన్న కేసులేనని నివేదిక స్పష్టం చేస్తోంది. ఇందులో పదేళ్ల కంటే ఎక్కువ పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 42 వేల 374 గా ఉన్నట్టు న్యాయశాఖ తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా వివిధ శాఖలపై పౌరులు, సంస్థలు దాఖలు చేసిన కేసుల సంఖ్య 2 లక్షల 20వేల 136గా తేలింది. అయితే ఇందులో 16 వేల కేసులు పరిష్కారం అయినట్టు ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్ లైన్ లీగల్ కేస్ మానిటరింగ్ వ్యవస్థ చెబుతోంది. వాస్తవానికి 2022 జూన్ 13 నుంచి జూలై 19 వరకూ ఒక్క నెలలోనే రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలను సవాలు చేస్తూ 9,687 కేసులు దాఖలయ్యాయి. అందులోనూ కోర్టు ఉత్తర్వులు అమలు చేయకపోవటంతో దాఖలైన కోర్టు ధిక్కరణకు సంబంధించిన కేసుల సంఖ్య 7,349.
హైకోర్టులో 2,35,617 కేసులు పెండింగ్.. ఆ 2 లక్షల కేసుల్లో.. - హైకోర్టులో పేరుకుపోతున్న పెండింగ్ కేసులు
Pending cases: హైకోర్టులో నమోదైన పెండింగ్ కేసుల్లో.. ప్రభుత్వం ప్రతివాదిగా ఉన్న కేసులే అత్యధిక భాగం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 2022 జూలై 15 నాటికి.. హైకోర్టులో 2 లక్షల 35,617 కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు.. కేంద్ర న్యాయశాఖ రాజ్య సభలో లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది.
హైకోర్టులో పేరుకుపోతున్న పెండింగ్ కేసులు
ఇక రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఉన్న పెండింగ్ కేసుల్లో అత్యధిక భాగం రెవెన్యూ శాఖవే ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్న కేసుల నిర్వహణ, పరిష్కారం కోసం రాష్ట్రప్రభుత్వం ఆన్ లైన్ లీగల్ మేనేజ్మెంట్ వ్యవస్థను అమలు చేస్తోంది.
ఇవీ చూడండి:
Last Updated : Jul 23, 2022, 11:55 AM IST