కార్పొరేట్ సంస్థల విద్యావ్యాపారాన్ని నియంత్రించే జీవో 23 అమలు చేయాలంటూ.. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం విజయవాడలో నిరసన చేపట్టింది. ప్రవేశాల ప్రక్రియను అంతర్జాలం ద్వారా కొనసాగించి.. రిజర్వేషన్ అమలు చేయాలని సంఘం సభ్యులు నినాదాలు చేశారు.
'విద్యను వ్యాపారంగా చూసే ప్రైవేటు కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి' - కార్పొరేట్ విద్యా వ్యాపారంపై విజయవాడలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిరసన
విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న పలు ఇబ్బందులపై.. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం విజయవాడలో ధర్నా నిర్వహించింది. విద్యను వ్యాపారంగా చూసే ప్రైవేట్ కళాశాలల దురాగతాలపై.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
విజయవాడలో పీడీఎస్యూ ధర్నా
తరగతి గదికి 40 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉండరాదనే నిబంధనను కచ్చితంగా పాటించాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. ఎయిడెడ్ కళాశాలల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ కళాశాలల గుర్తింపులు రద్దు చేయాలన్నారు.
ఇదీ చదవండి:'మార్పు మొదలైంది...భాజపాకు ప్రజలు బుద్ధి చెబుతారు'
TAGGED:
pdsu protests in vijayawada