PM Garib Kalyan Yojana : ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని 2022 మార్చి వరకూ కేంద్ర ప్రభుత్వం పొడిగించినట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్ వెల్లడించారు. ఏపీలోని లబ్ధిదారులందరికీ మార్చి నెలవరకూ ఉచితంగా 5 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని నిర్ణయించారని ఆయన తెలిపారు. 2021 డిసెంబరు నుంచి లబ్ధిదారులకు ఐదేసి కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేయాల్సిందిగా కేంద్రం ఏపీ పౌరసరఫరాలకు ఆదేశాలు ఇచ్చిందని.. అయితే ఏపీ వద్ద ప్రస్తుతం బియ్యం నిల్వలు లేనందున సేకరిస్తున్న బియ్యం నుంచే ఈ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. జనవరి 18వ తేదీ నుంచి రాష్ట్రంలోని లబ్ధిదారులకు రేషన్ దుకాణాల ద్వారా 10 కేజీల చొప్పున ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు.
PM Garib Kalyan Yojana : వారికి రేషన్ దుకాణాల ద్వారా 10కేజీల బియ్యం అందజేత..
PM Garib Kalyan Yojana : ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని 2022 మార్చి వరకూ కేంద్ర ప్రభుత్వం పొడిగించినట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజాశంకర్ వెల్లడించారు. ఏపీలోని లబ్ధిదారులందరికీ మార్చి నెలవరకూ ఉచితంగా 5 కేజీల చొప్పున బియ్యం ఇవ్వాలని నిర్ణయించారని ఆయన తెలిపారు.
వారికి రేషన్ దుకాణాల ద్వారా 10కేజీల బియ్యం అందజేత..
TAGGED:
PM Garib Kalyan Yojana