ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వారంతా ఓటు వేసేలా చర్యలు తీసుకోండి: ఎస్ఈసీకి లేఖలో పీసీసీ చీఫ్ - ఎస్​ఈసీ నిమ్మగడ్డకు శైలజనాథ్ పీసీసీ అధ్యక్షుడు లేఖ

దళితులు, ఆదివాసీలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని.. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. వారి నివాస ప్రాంతాలకు దగ్గరలో అత్యధిక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ.. ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్​కు లేఖ రాశారు.

pcc president sailajanath letter to sec requesting  to take steps to ensure that Dalits and Adivasis to caste their votes
దళితులు, ఆదివాసీలు ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోండి.. ఎస్​ఈసీకి శైలజనాథ్ లేఖ

By

Published : Feb 3, 2021, 1:27 PM IST

దళితులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని.. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ కోరారు. వారి నివాస ప్రాంతాలకు దగ్గరలో అత్యధిక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్​కు లేఖ రాశారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో.. దళిత, ఆదివాసీలు తమ ఒటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోలేకపోతున్నారని లేఖలో పేర్కొన్నారు.

కులాధిపత్యం చూపిస్తూ.. భయాందోళనలకు గురిచేస్తున్నారు

రాజకీయ పెత్తందార్లు తమ ప్రాంతంలో కులాధిపత్యం చూపిస్తూ.. భయభ్రాంతులకు గురిచేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరారు. రాష్ట్రంలో జరుగుతోన్న ఏకగ్రీవాలు నిజం కావని.. అధికార పార్టీ నేతలు ఇతరులను బెదిరించి ఏకగ్రీవాలు చేస్తున్నారని పలువురు కాంగ్రెస్ నేతలు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. వేలం పాటలు నిర్వహించి ఏకగ్రీవాలు చేస్తున్నారని తెలిపారు. వీటన్నింటిపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదీ చదవండి:

పంచాయతీ పోరు: జోరుగా రెండో విడత నామినేషన్ల ప్రక్రియ

ABOUT THE AUTHOR

...view details