కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు యాభై లక్షలు పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌ను విజ్ఞప్తి చేసినట్లు ఇండియన్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టు మృతుల కుటుంబాలకు జగన్ ప్రభుత్వం 5 లక్షల ఆర్థికసాయం అందజేస్తుందని...ఆ మెుత్తాన్ని 50 లక్షలకు పెంచాలని కోరినట్లు తెలిపారు. పాత్రికేయులను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా ప్రధాని మోదీ అభివర్ణించారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన సానుకూలంగా స్పందించినట్లు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు.
'జర్నలిస్టు కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలి'
పాత్రికేయుల సమస్యలను ముఖ్యమంత్రి జగన్‌కు వివరించినట్లు ఇండియన్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు కె. శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు యాభై లక్షలు పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు.
జర్నలిస్టు కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలి