తెలంగాణ గవర్నర్ నరసింహన్తో జనసేనాని భేటీ - janasena
గవర్నర్ నరసింహన్తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. దేశాభివృద్ధి, తెలుగురాష్ట్రాల్లో పరిస్థితులపై వారు ముచ్చటించారు.
పవన్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ను పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మెన్ నాదెండ్ల మనోహర్ హైదరాబాద్లోని రాజభవన్లో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు రాష్ట్రాల విషయాలతోపాటు జాతీయ అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. దేశాభివృద్ధి, లక్ష్యసాధనకు ప్రణాళికలు వంటి విషయాలను చర్చించారు. దేశాభివృద్ధి, దేశ సమగ్రతలపై జనసేన పార్టీ ఆలోచనలను గవర్నర్కు పవన్ కళ్యాణ్ వివరించారు.