నెల జీతం ఆపడం, ఆర్టీసీ ఎండీ కార్యాలయం నుంచి విడుదలైన ఉత్తర్వులతో ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ విభాగంలోకి వచ్చే ఉద్యోగుల జీతాలు 6 వేల నుంచి 15 వేల రూపాయలేనని.. లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ జీతాలు చెల్లించకపోతే వారు జీవనం ఎలా సాగిస్తారని పవన్ ప్రశ్నించారు. కష్ట కాలంలో ఉద్యోగాలు తొలగించొద్దని.. కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం లేదని రవాణాశాఖ మంత్రి ప్రకటన ..చేసినా వారిలో నెలకొన్న భయాందోళన తొలగిపోలేదని జనసేనాని అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తక్షణం జీతం బకాయి చెల్లించి, ఉద్యోగ భద్రత హామీని రాతపూర్వకంగా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్ చేశారు.
వారికి ఉద్యోగ భద్రత హామీని రాతపూర్వకంగా ఇవ్వాలి: పవన్ - వైసీపీపై జనసేన పవన్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులలో ఉద్యోగ భద్రతపై నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. సుమారు 7,600 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆర్టీసీని నమ్ముకుని జీవిస్తున్నారన్నారు.

pawan on rtc oursourcing employees