ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేసీఆర్ స్ఫూర్తితో ఈడబ్య్లూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి: పవన్ - ఏపీలో ఈడబ్యూఎస్ రిజర్వేషన్లు

తెలంగాణ సీఎం కేసీఆర్ చూపించిన స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్ ఈడబ్య్లూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని జనసేన అధినేత పవన్ కోరారు. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం అభినందనీయమన్నారు.

కేసీఆర్ స్ఫూర్తితో ఈడబ్య్లూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి
కేసీఆర్ స్ఫూర్తితో ఈడబ్య్లూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి

By

Published : Jan 22, 2021, 9:18 PM IST

తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం అభినందనీయమని జనసేన అధినేత పవన్ కొనియడారు. కేసీఆర్ చూపించిన స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్ ఈడబ్య్లూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల విద్యా, ఉపాధి అవకాశాలు మరింత మెరుగై ఆ వర్గాల్లో ఉపశమనం లభిస్తుందన్నారు. కాపు రిజర్వేషన్​కు ఎలాగూ వ్యతిరేకం కాబట్టి ఈ విధంగానైనా ఈడబ్య్లూఎస్ అమలు చేస్తే అగ్రవర్ణ పేదలకు కాస్త ఊరట లభిస్తుందని తెలిపారు.

కేసీఆర్ స్ఫూర్తితో ఈడబ్య్లూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలి

ABOUT THE AUTHOR

...view details