Pawan Kalyan: తెలుగు శాస్త్రవేత్తలు రచించిన 'గ్లింప్స్ ఆఫ్ సాయిల్ సైన్స్' అనే పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. భూసార శాస్త్రంపై పీహెచ్డీ చేసిన ఈటెల సత్యనారాయణ, సంతోశ్ కుమార్ మంచాల, జురుకుంట్ల భార్గవిలతో కలిసి ఉత్తర భారత శాస్త్రవేత్తలు హనుమాన్ సింగ్ జాతవ్, నిధి లూత్రా, జకనూర్ బి.అయివల్లి ఈ పుస్తకాన్ని రచించారు. రైతులకు, పర్యావరణానికి ఎంతో ఉపయుక్తంగా ఉండే ఈ గ్రంథాన్ని రచయితలు పవన్‌కు అంకితం ఇచ్చారు.
గ్లింప్స్ ఆఫ్ సాయిల్ సైన్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్
book release తెలుగు శాస్త్రవేత్తలు రచించిన గ్లింప్స్ ఆఫ్ సాయిల్ సైన్స్ అనే పుస్తకాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. శాస్త్రవేత్తల సేవలు దేశానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా పవన్ వారిని కొనియాడారు.
గ్లింప్స్ ఆఫ్ సాయిల్ సైన్స్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన పవన్
శాస్త్రవేత్తల సేవలు దేశానికి ఎంతో అవసరమని ఈ సందర్భంగా పవన్ కొనియాడారు. జనసేన పక్షాన 'గ్రీన్ పాలసీ' రూపొందించాలని సంకల్పించామని చెప్పారు. అందులో పాలు పంచుకోవాల్సిందిగా రచయితలను కోరగా..అందుకు వారు సుముఖత వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి