PAWAN TWEET:ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాలను ఘనంగా అమలుచేశామంటూ వైకాపా పాలకులు ప్రజల్ని మభ్యపెడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆరోపించారు. ‘నవరత్నాలపై నవ సందేహాలు’ పేరిట ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. ‘రైతుభరోసా ద్వారా 64 లక్షల మందికి మేలు చేస్తున్నామని చెబుతూ... 50 లక్షల మందికే లబ్ధి చేకూర్చడం నిజం కాదా? మూడేళ్లలో మూడువేల మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే 700 మందికే ఆర్థికసాయాన్ని పరిమితం చేయలేదా? 43 లక్షల మందికే అమ్మఒడి ఇచ్చి 83 లక్షల మందికి ఇచ్చినట్లు ఎందుకు అసత్యప్రచారం చేస్తున్నారు? 5 లక్షల మందికి పింఛన్లను తొలగించిన విషయం వాస్తవం కాదా? మద్యనిషేధం అంటే 2018-19 నాటికి రూ.14 వేల కోట్లుగా ఉన్న మద్యం ఆదాయం 2021-22 నాటికి రూ.22 వేల కోట్లకు పెంచుకోవడమేనా? మద్యం ఆదాయం చూపించే రూ.8వేల కోట్ల విలువైన బాండ్లు అమ్మి రుణాలు తీసుకోలేదా? పోలవరం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన ఎప్పుడు పూర్తిచేస్తారు? ఆరోగ్యశ్రీ నుంచి ఆసుపత్రులు ఎందుకు వైదొలగుతున్నాయి? సీఎంఆర్‌ఎఫ్ నుంచి వైద్యఖర్చులు ఎందుకు చెల్లించట్లేదు? ఫీజు రీయింబర్స్‌మెంటు చేయక విద్యార్థులకు హాల్‌టికెట్లు ఆపేస్తున్న మాట నిజం కాదా? చెరువులు, గుట్టల్లో పేదలకు స్థలాలిచ్చిన మాట నిజం కాదా? పేదల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎందుకు మంజూరు చేయట్లేదు? పొదుపు సంఘాల సంఖ్యను ఏటా లక్షల కొద్దీ ఎందుకు తగ్గిస్తున్నారు?’ అని పవన్‌కల్యాణ్ ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు.
PAWAN TWEET: 'నవరత్నాలపై.. నవసందేహాలు'.. పవన్ ట్వీట్
PAWAN TWEET: వైకాపా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న ప్లీనరీ సమావేశాల సందర్భంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నవసందేహాల పేరిట ట్వీట్ చేశారు. వైకాపా ప్రభుత్వం ప్రధాన అంశాలుగాపేర్కొంటున్న నవరత్నాలపై విడివిడిగా తన సందేహాలను ట్వీట్‌లో పొందుపరిచారు.
PAWAN TWEET
ముద్దుల మామయ్య కాదు.. బడి దొంగ
హేతుబద్ధీకరణ పేరిట 8వేల బడుల్ని మూసేసి జగన్ మామ పిల్లల్ని బడికి దూరం చేస్తున్నారంటూ ఉన్న ఓ వ్యంగ్యచిత్రాన్ని పవన్‌కల్యాణ్ ట్వీట్ చేశారు. బడిని చేత్తో పట్టుకుని ఎగిరిపోతున్నట్లు ఉన్న ఓ వ్యక్తిని చూపిస్తూ ఇద్దరు విద్యార్థులు ‘ముద్దుల మామయ్యంట... ముద్దుల మామయ్య.. దొంగ మామయ్య... బడిదొంగ మామయ్య. మా బడిని ఎత్తుకెళ్తున్నాడు’ అని చెబుతున్నట్లు ఆ వ్యంగ్య చిత్రం ఉంది.
ఇవీ చదవండి:
Last Updated : Jul 9, 2022, 6:42 AM IST