Pawan kalyan on Rape Case: రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరవవుతోందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం దుర్మార్గమన్నారు. పోలీసులు సకాలంలో స్పందిస్తే ఇంత ఘోరం జరిగేది కాదన్నారు. ఆస్పత్రిలో పని చేస్తున్నవారే అఘాయిత్యానికి ఒడిగట్టడం.. అక్కడి నిఘా, సెక్యూరిటీ లోపభూయిష్టానికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించటంతోపాటు బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని కోరారు. అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని జనసేనాని డిమాండ్ చేశారు. మహిళల రక్షణ పట్ల పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని పవన్ సూచించారు. మహిళల రక్షణ కోసం తీసుకొచ్చిన దిశ చట్టం ఇప్పటికీ అమలు కావడం లేదన్న పవన్‌కల్యాణ్.. దిశ చట్టం ఎప్పటి నుంచి అమలవుతుందో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరువు.. "దిశ" ఎక్కడ..? : పవన్ - Janasena PAC Chairman Nadendla Manohar news
Pawan kalyan React on Vijayawada Rape Case: విజయవాడలో మానసిక వికలాంగురాలిపై అత్యాచారం దుర్మార్గమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ కరవవుతోందన్న పవన్.. అత్యాచార ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు.. శనివారం పవన్ నిర్వహించనున్న యాత్రకు అడ్డంకులు కలిగించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
Nadendla on pawan Tour:జనసేన చేపట్టిన 'కౌలు రైతు భరోసా యాత్ర'కు ఆటంకం స్పష్టంచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో శనివారం.. పవన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో చింతలపూడి నియోజకవర్గం ధర్మాజీగూడెం వద్ద రహదారిని అడ్డంగా తవ్వించేస్తున్నారు. ఉన్నపళంగా జేసీబీతో రోడ్డుని తవ్విస్తుండడాన్ని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. చింతలపూడిలో పవన్ పర్యటన ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్తున్న నాదెండ్ల మనోహర్.. మార్గం మధ్యలో రోడ్డు తవ్వుతున్న దృశ్యాలు చూసిన ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, నాదెండ్ల.. జేసీబీని అడ్డుకున్నారు. రహదారి పనుల ముసుగులో పవన్ యాత్రను అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఇదీ చదవండి: