Pawan kalyan: మహావతార్ బాబాజీ స్ఫూర్తితో.. నౌషిర్ గురూజీ ప్రారంభించిన తదేకం ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఎంతో విలువైనవని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు జనసైనికులు మద్దతు తెలపడం సంతోషకరమన్నారు. తదేకం ఫౌండేషన్ తరఫున.. జనరల్ సంజయ్ మిత్రా హైదరాబాద్‌లో పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఫౌండేషన్ ప్రతినిధులు మాధవి, సాయి సుధ, నీలేష్.. పవన్, నాదెండ్లతో కలిసి పార్టీ వ్యవహారాలపై చర్చించారు. జనసేన పార్టీతో కలసి తూర్పు గోదావరి జిల్లాలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను వివరించారు.
"జనసైనికులు ఇక ముందు కూడా ఇదే స్ఫూర్తిని, సేవా భావాన్ని కొనసాగిస్తూ.. సేవా కార్యక్రమాలకు అండగా నిలవాలి. తదితర ప్రాంతాలకు విస్తరించడం స్ఫూర్తిదాయకం. ముఖ్యంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్పిరిచ్యువల్ ఎడ్యుకేషన్ తో పాటు సేవా కార్యక్రమాలు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి. మహా అవతార్ బాబాజీని చిరంజీవిగా చెబుతారు. తాను పదో తరగతి చదువుతున్నప్పుడు 'ఒక యోగి ఆత్మ కథ' పుస్తకంతో పాటు ఆయన స్ఫూర్తితో క్రియా యోగ దీక్ష గురించి మా తండ్రి వివరించారు" -పవన్ కల్యాణ్, జనసేన అధినేత