ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Pawan: తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు.. ప్రభుత్వ తీరే కారణం: పవన్

చెరకు రైతుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే సమస్య తీవ్రమైందని జనసేన అధినేత పవన్ ఆరోపించారు. తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో.. సర్కారు తీరు చేదు నింపిందని అన్నారు. బకాయిలను తక్షణమే ఇప్పించకపోవడం రైతులను వంచించడమేనని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ తీరు వల్ల తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు నిండుతోంది
ప్రభుత్వ తీరు వల్ల తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు నిండుతోంది

By

Published : Nov 4, 2021, 3:08 PM IST

Updated : Nov 4, 2021, 3:30 PM IST

విజయనగరం జిల్లా లచ్చయ్యపేటలో చెరకు రైతుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే.. సమస్య తీవ్రమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. రెండేళ్ల నుంచి రైతులకు రావాల్సిన బకాయిలు ఇప్పించకుండా.. సమస్యను శాంతిభద్రతల అంశంగా చూడటం భావ్యం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు.. ఓ ప్రకటన విడుదల చేశారు జనసేనాని.

ప్రభుత్వ తీరు వల్ల తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు నిండుతోందని అవేదన వ్యక్తం చేశారు. బకాయిలను తక్షణమే ఇప్పించకుండా.. జనవరిలో ఇచ్చేలా యాజమాన్యాన్ని ఒప్పిస్తామనడం రైతులను వంచించడమేనని స్పష్టం చేశారు. ఈ సమస్యపై రైతుల పక్షాన నిలబడాలని జనసేన పార్టీ నాయకులకు ఇప్పటికే స్పష్టం చేసినట్లు.. పవన్ తెలిపారు. రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా బకాయిలు ఇప్పించే అవకాశం ఉన్నా.. ఆ చట్టాన్నివినియోగించకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

Last Updated : Nov 4, 2021, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details