ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వేడుకలు చేసుకునే అలవాటు చిన్నప్పటినుంచే లేదు: పవన్ - పవన్ బర్త్​ డే న్యూస్

ఇప్పుడున్న ఆరోగ్య విపత్కర పరిస్థితుల్లో పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ మీడియా విభాగంతో పవన్ కల్యాణ్ సమావేశమై.... పలు అంశాలు చర్చించారు. తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జన సైనికులు, నాయకులు, వీర మహిళలు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ ఆసుపత్రులకు ఆక్సిజన్ సిలిండర్ కిట్లు వితరణ చేయడంపై పవన్‌ స్పందించారు.

pawan kalyan on janasainikulu
pawan kalyan on janasainikulu

By

Published : Sep 1, 2020, 6:08 PM IST

Updated : Sep 1, 2020, 6:17 PM IST

తాను జన్మదిన వేడుకలకు దూరంగా ఉండడానికి ప్రత్యేకించి కారణాలు ఏమీ లేవని... చిన్నప్పటి నుంచి అలవాటు లేదని పవన్‌ అన్నారు. జనసైనికులు, అభిమానులు, వీర మహిళలు సేవా వారోత్సవాలు జరుపుతున్నారని... తొలి రోజున రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రులకు 341 ఆక్సిజన్ సిలిండర్ కిట్లు అందజేశారని... అలాగే చాలాచోట్ల రక్తదాన శిబిరాలు, పేదలకు నిత్యావసర సరకులను పంపిణీ చేశారని మీడియా విభాగం వివరించింది. సేవా వారోత్సవాలు చేసిన అందరికీ పవన్‌ కల్యాణ్‌ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

Last Updated : Sep 1, 2020, 6:17 PM IST

ABOUT THE AUTHOR

...view details