ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Pawan Kalyan: సంపూర్ణంగా మద్యం మీదే ప్రభుత్వ ఆదాయం: పవన్ కల్యాణ్ - మద్య నిషేదం వివాదంపై వైకాపాపై పవన్ కల్యాణ్ ఫైర్

Pawan Kalyan: రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు 'కాదు కాదు' సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు పరిస్థితి తయారైందని పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు.. సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ట్వీట్‌లో జోడించారు.

Pawan Kalyan
పవన్‌ కల్యాణ్‌

By

Published : Jun 12, 2022, 10:50 AM IST

Pawan Kalyan: రాష్ట్రంలో మద్యం విధానంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. విమర్శనాస్త్రాలు సంధించారు. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు 'కాదు కాదు' సంపూర్ణంగా మద్యం మీదే ఆదాయం సంపాదిస్తామన్నట్లు పరిస్థితి తయారైందని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివేనని.. చిన్న గమనిక అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు.

వీటి ద్వారా వచ్చే అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వారికే అని ఆరోపించారు. అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు.. సత్యవర్తనులు ఆయనకిష్టులు అంటూ బైబిల్ సూక్తిని ట్వీట్‌లో జోడించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details