PAWAN: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, వీరేంద్ర హెగ్గడే, పి.టి.ఉషలను ఎంపిక చేశారనే వార్త ఎంతో ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రపతి ద్వారా నామినేట్ అయిన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. స్వర జ్ఞాని ఇళయరాజా, సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్, సామాజిక సేవకులు వీరేంద్ర హెగ్గడే, పరుగుల రాణి పి.టి.ఉష.. తమ రంగాల్లో మన దేశ పేరు, ప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన శ్రేష్ఠులని కొనియడారు. వీరి సేవలు, అనుభవాన్ని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు ప్రకటించారు.
PAWAN: రాజ్యసభకు వారిని ఎంపిక చేసినందుకు ప్రధానికి అభినందనలు: పవన్
PAWAN: పెద్దల సభకు నామినేట్ అయిన ఇళయరాజా, విజయేంద్రప్రసాద్, వీరేంద్ర హెగ్గడే, పి.టి.ఉషలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. వారు మన దేశ పేరు, ప్రతిష్ఠలను ఇనుమడింపజేసిన శ్రేష్ఠులని కొనియడారు.
రాజ్యసభకు వారిని ఎంపిక చేసినందుకు ప్రధానికి అభినందనలు
పెద్దల సభకు నలుగురు ప్రముఖులు: రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజ, పరుగుల రాణి పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డే ఆ జాబితాలో ఉన్నారు. ఆయ రంగాలో వీరు చేసిన విశేష కృషిని గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వి.విజయేంద్రప్రసాద్, ఇళయరాజ, పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డేను పెద్దల సభకు ఎంపిక చేసింది.
ఇవీ చదవండి:
TAGGED:
pawan kalyan wishes