ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక కావటం సంతోషదాయకం - pawan kalyan

Pawan Kalyan wishes తెలుగు కవులు పళ్లిపట్టు నాగరాజు, పత్తిపాక మోహన్​లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక కావటం సంతోషదాయకమని జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఈ స్ఫూర్తితో నవ కవులు, రచయితల నుంచి మరిన్ని ఉత్తమ రచనలు రావాలని పవన్‌ ఆకాంక్షించారు.

వారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక కావటం సంతోషదాయకం
వారు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక కావటం సంతోషదాయకం

By

Published : Aug 25, 2022, 3:38 PM IST

Pawan Kalyan: తిరుపతి జిల్లాకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు పళ్లిపట్టు నాగరాజు, తెలంగాణలోని సిరిసిల్లకు చెందిన పత్తిపాక మోహన్​లు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక కావటం సంతోషదాయకమని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వారికి తన తరఫున, జనసేన పార్టీ తరుపున అభినందనలు తెలిపారు. యువ విభాగంలో పురస్కారానికి ఎంపికైన పళ్లిపట్టు నాగరాజు రాసిన 'యాలై పూడ్సింది'లో ఆయన రాసిన కవితల్లో ఒకటి చదివానన్నారు. నేటి యువత చైతన్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని ఆ అక్షరాలు చూపాయన్నారు.

బాల సాహిత్య విభాగంలో పురస్కారం పొందిన పత్తిపాక మోహన్ కవితా సంకలనం 'బాలల తాతా బాపూజీ'లో జాతిపిత గురించి భావి పౌరులకు అర్థమయ్యేలా చెప్పడం అభినందించదగ్గ ప్రయత్నమని కొనియాడారు. తెలుగు భాషను తెలుగు వారికి దూరం చేసే ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు. అమ్మ భాషను కాపాడుకొంటూ భావి తరాలకు వారసత్వ సంపదగా అందించాల్సిన అవసరం మనందరిపై ఉందని అన్నారు. నాగరాజు, మోహన్ లాంటి కవులు చేస్తున్న ప్రయత్నాలకు పురస్కారాలు దక్కటం సంతోషమని అన్నారు. ఈ స్ఫూర్తితో నవ కవులు, రచయితల నుంచి మరిన్ని ఉత్తమ రచనలు రావాలని పవన్‌కల్యాణ్‌ ఆకాంక్షించారు.

తెలుగు కవులకు పవన్ అభినందనలు

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details