ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రఘునందన్​ రావుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ - తెలంగాణ భాజాపా నేతలకు పవన్ శుభాకాంక్షలు

దుబ్బాక ఉపఎన్నికల్లో విజయం సాధించిన భాజపా అభ్యర్థి రఘునందన్ రావుకు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు జనసేన అధినేత పవన్ శుభాకాంక్షలు తెలిపారు. రఘునందన్ రావు వ్యక్తిత్వం, ప్రజా సేవలో చూపే నిబద్దత ఆయనకు విజయహారాన్ని అందించిందని ప్రశంసించారు.

రఘనందన్​ రావుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్
రఘనందన్​ రావుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్

By

Published : Nov 10, 2020, 6:54 PM IST

తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించిన భాజపా అభ్యర్థి రఘునందన్ రావు, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్​‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికల్లో విజయం భాజపా నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి నిదర్శనంగా తాను భావిస్తున్నానని తెలిపారు. భాజపా తెలంగాణ అధ్యక్షుడిగా పగ్గాలు స్వీకరించిన నాటి నుంచి నేటి దుబ్బాక ఉప ఎన్నికల వరకు బండి సంజయ్ చూపిన నాయకత్వ పటిమ ఈ విజయానికి మార్గం వేసిందని ప్రశంసించారు.

పార్టీలోని అన్ని వర్గాలను సమాయత్తం చేసి ఆయన ఈ విజయాన్ని సాధించారన్నారు. రఘునందన్ రావు వ్యక్తిత్వం, ప్రజాసేవలో చూపే నిబద్దత ఆయనకు విజయహారాన్ని అందించిందని ప్రశంసించారు. రాజకీయాలను సక్రమ మార్గంలో నడిపించటం యువత వల్లే సాధ్యమవుతుందని తాను విశ్వసిస్తానని..ఈ ఎన్నికలో యువకులు విశేష సంఖ్యలో పాల్గొనడం ఒక శుభపరిణామమని అన్నారు. దుబ్బాక విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా పవన్‌ అభినందనలు తెలిపారు.

రఘనందన్​ రావుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్

ABOUT THE AUTHOR

...view details