ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తంటికొండ రోడ్డు ప్రమాద ఘటన కలిచివేసింది: పవన్ కల్యాణ్ - పవన్ కల్యాణ్ తాజా వార్తలు

తూర్పుగోదావరి జిల్లా తంటికొండలో జరిగిన ప్రమాదంలో మృతుల కుటుంబాలకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటన తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరారు.

pawan kalyan
పవన్ కల్యాణ్

By

Published : Oct 30, 2020, 2:27 PM IST

తూర్పుగోదావరి జిల్లా తంటికొండ ఘాట్ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారనే వార్త కలచివేసిందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ అన్నారు. ఆనందంగా పెళ్లి వేడుకకు హాజరై వస్తున్నవారు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికరమన్నారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను, తూర్పుగోదావరి జిల్లా అధికారులను కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందించి ఆదుకోవాలని పవన్‌ విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details