కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందడంపై.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పనుల కోసం ఉదయాన్నే బయలుదేరిన కూలీలు.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతులకు మెరుగైన పరిహారం అందించాలని కోరారు.
నూజివీడు రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా వార్తలు
కృష్ణా జిల్లా నూజివీడులో జరిగిన రోడ్డు ప్రమాదం దురదృష్టకరమని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ఆరుగురు కూలీలు మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమన్నారు.
నూజివీడు రోడ్డు ప్రమాదంలో కూలీల మృతిపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి
కూలీ పనులకు వెళ్లి వచ్చే వేళలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి:48 గంటల్లోగా సమస్య పరిష్కారం!