ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

డ్రోన్ రాజకీయాలు అవసరమా?:పవన్ కల్యాణ్ - రాజకీయాలు

కృష్ణా నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లుపడుతుంటే...వారికి సాయం చేయకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరగడం ఏంటని జనసేన అధ్యక్షుడు పవన్ మండిపడ్డారు.

pawan_kalyan_comments_about_drone_politics

By

Published : Aug 17, 2019, 9:39 PM IST


వరదతో లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షితంగా ఉండేలా చూసే బాధ్యత ప్రభుత్వానిదని...కరకట్ట మీద ఉన్న నిర్మాణాలు మునిగిపోతాయా? లేదా? అంటూ డ్రోన్లు ఎగరేసి చూడటం మంత్రుల బాధ్యతా? అంటూ జనసేనాని పవన్ ప్రశ్నించారు. వరద ఉధృతి పెరిగితే కరకట్ట ప్రాంతంలో ఉన్న అన్ని నివాసాలు మునుగుతాయని....డ్రోన్ రాజకీయాలు అక్కర్లేదని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటిని ముంచేస్తారా? అని ప్రతిపక్షం, మునిగిందా లేదా? అని చూసేందుకు అధికార పక్షం వాళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధల్లో ఉన్న ప్రజలను వరద నీటికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధ్యతతో సుపరిపాలన అందించాలని....విమర్శలకు తావిచ్చేలా వ్యవహరించడం తగదని హితవు పలికారు.

డ్రోన్ రాజకీయాలు అవసరమా?:పవన్ కల్యాణ్

ABOUT THE AUTHOR

...view details