ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంతాలు వదిలి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టండి: పవన్ కల్యాణ్ - కరోనా వైరస్ న్యూస్

కరోనా వైరస్​పై అప్రమత్తంగా ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ప్రజారోగ్యానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు.

pawan kalyan about corona virus
pawan kalyan about corona virus

By

Published : Mar 18, 2020, 3:07 PM IST

కరోనా వైరస్ ప్రభలుతున్న నేపథ్యంలో ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని జనసేనాని పవన్ కల్యాణ్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పంతాలు వదిలి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని హితవు పలికారు. కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించారు. కరోనాను తేలిగ్గా తీసుకోవడం సరికాదన్న పవన్... కేంద్రం చెప్పినట్లు అన్ని విద్యా సంస్థలను మూసివేయాలని కోరారు. ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో వైద్య బృందాలను నియమించాలని పేర్కొన్నారు. జనసేన పార్టీ తరఫున మా శ్రేణులకు ఇప్పటికే ప్రణాళిక ఇచ్చామని పవన్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details