ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రశ్నించిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులా? ఎన్​హెచ్​ర్సీకి ఫిర్యాదు చేస్తాం: పవన్‌ - ప్రభుత్వంపై పవన్ కామెంట్స్

Pawan Kalyan comments on ysrcp: సమస్యలపై ప్రశ్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసులు ఎలా పెడతారని జనసేన్ అధినేత పవన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని వైకాపా ప్రభుత్వం ఇష్టానుసారం ఉపయోగిస్తోందని ఆయన మండిపడ్డారు.

ప్రశ్నించిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులా?
ప్రశ్నించిన వారిపై నాన్‌బెయిలబుల్ కేసులా?

By

Published : Aug 6, 2022, 7:04 PM IST

Janasena: ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టాన్ని వైకాపా ప్రభుత్వం ఇష్టానుసారం ఉపయోగిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. చిత్తూరు జిల్లా వేపనపల్లి అనే గ్రామంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో జశ్వంత్ అనే యువకుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవటంపై స్థానిక ఎమ్మెల్యేను ప్రశ్నిస్తే.. అతనితో పాటు మరో తొమ్మిది మంది జన సైనికులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. ఇలా సమస్యలపై ప్రశ్నించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద నాన్ బెయిలబుల్ కేసులు ఎలా పెడతారని పవన్ ప్రశ్నించారు.

Pawan fire on YSRCP: ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా రిమాండ్​కు తీసుకెళ్లిన పోలీసులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. న్యాయమూర్తి రిమాండు రిపోర్టును రిజెక్టు చేసినా.. ఆ యువకుల్ని ఈ కేసులో ఏదో రకంగా ఇరికించాలని నాయకులు, పోలీసులు ప్రయత్నించారని ఆరోపించారు. ప్రశ్నించినంత మాత్రానా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వేధిస్తాం అంటే ఎలా ? అని నిలదీశారు. నిజంగా ఆ యువకులు పరిధి దాటి ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా ? అని మండిపడ్డారు. ఇలా అకారణంగా ప్రశ్నించిన వారిని వేధించటం అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ విషయాన్ని మానవహక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని పవన్ స్పష్టం చేశారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details