ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హిందూ ధర్మం విచ్ఛిన్నానికే విగ్రహాల ధ్వంసం: పవన్ ‌కల్యాణ్‌ - విగ్రహాల ధ్వంసంపై పవన్ వ్యాఖ్యలు

హిందువుల మనోభావాల విఘాతానికి కుట్ర పన్నుతున్నారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. రాష్ట్రంలో వరుస ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఆలయ ఆస్తుల విధ్వంసానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

హిందూ ధర్మం విచ్ఛిన్నానికే విగ్రహాల ధ్వంసం
హిందూ ధర్మం విచ్ఛిన్నానికే విగ్రహాల ధ్వంసం

By

Published : Jan 2, 2021, 6:15 PM IST

హిందూ ధర్మం విచ్ఛిన్నానికే విగ్రహాల ధ్వంసాలకు తెగబడుతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. ఆలయ ఆస్తుల విధ్వంసానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. హిందూ మనోభావాల విఘాతానికి కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వరుస ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం వల్లే దుండగులు పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు. విగ్రహాలు పగలగొడుతున్నా, రథాలను తగలబెడుతున్నా...ప్రభుత్వ పెద్దలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తే....నిందితులను అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఆలయ పునర్నిర్మాణ బాధ్యతను తీసుకున్నారని గుర్తు చేశారు. శత్రుదేశం పాటి చర్యలను కూడా వైకాపా ప్రభుత్వం తీసుకోలేదా? అని నిలదీశారు. ఈ దాడులను కట్టడి చేయాలంటే నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలని సూచించారు. హిందూ ఆలయాలు, విగ్రహాలపై జరుగుతున్న దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించి... వాటి పునరుద్ధరణ చర్యలను తీసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details