తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని... పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా... మాతృభాషను కాపాడుకుంటున్నారు. భాషని చంపుకోవడమంటే... మన ఉనికిని చంపుకోవడమేనని జనసేన అధినేత వ్యాఖ్యానించారు. ప్రాథమిక విద్య అంతా తెలుగు మాధ్యమంలోనే చదివానని... తమిళ భాష గురించి ఒక్క మాట అంటే ఆ రాష్ట్రం మెుత్తం ఒక్కటైందని గుర్తుచేశారు. మన నేతలకు తెలుగు భాష అంటే గౌరవం లేదని పవన్ విమర్శించారు. ఉపాధ్యాయులు, మేధావులందరూ బయటకు వచ్చి మాట్లాడాలని కోరారు.
తెలుగును విస్మరిస్తే మట్టిలో కలిసిపోతారు: పవన్ - తెలుగు భాషని చంపుకోవడమంటే...మన ఉనికిని చంపుకోవడమేనన్న పవన్ కల్యాణ్
తెలుగు భాషని చంపుకోవడమంటే... మన ఉనికిని చంపుకోవడమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగును విస్మరిస్తే ఎవరైనా మట్టిలో కలిసిపోతారని విమర్శించారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్