Air Chief Marshal Vivek Ram Chaudhary : త్రిదళపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరుగుతోందని ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి వెల్లడించారు. హెలికాప్టర్ ప్రమాదానికి కారణాలు విచారణలో తేలుతాయన్నారు. హైదరాబాద్ నగరంలోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించారు. పరేడ్‌కు ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా.. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్ల నుంచి ఆయన తొలి గౌరవ వందనం స్వీకరించారు. పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా క్యాడెట్లు విన్యాసాలు చేశారు.
Passing out parade at Dundigal Air Force Academy : భారత వాయుసేన అత్యంత శక్తివంతమైందని వాయుసేన చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి అన్నారు. దేశ సేవలో నిబద్ధతతో పనిచేయాలని క్యాడెట్లకు పిలుపునిచ్చారు. సీడీఎస్ రావత్ మరణం దురదృష్టకరమన్న ఆయన.. రావత్ దంపతులు, సైనికాధికారులకు నివాళులు అర్పించారు.
‘‘సీడీఎస్ రావత్ మరణం దురదృష్టకరం. రావత్ దంపతులు, సైనికాధికారులకు నివాళులు అర్పిస్తున్నాం. భారత వాయుసేన అత్యంత శక్తివంతమైనది. వాయుసేనలో పని చేసే అదృష్టం దక్కడం గొప్ప విషయం. శిక్షణలో సమర్థ చూపి గెలిచారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేశమే ప్రథమం కావాలి. ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకడుగు వేయొద్దు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా విలువలు మరవద్దు. దేశ సేవలో నిబద్ధతతో పని చేయాలి’’.
-వివేక్ రామ్ చౌదరి, ఎయిర్ చీఫ్ మార్షల్