ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పేలిన ఆర్టీసీ బస్సు టైరు.. ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు - rtc bus tire explosion at gannavaram

ఆర్టీసీ బస్సు టైరు‌ పేలిన ఘటనలో ప్రయాణికులు గాయపడ్డారు. ఏలూరు నుంచి విజయవాడ వెళ్తున్న నాన్​స్టాప్ బస్సు టైరు ఒక్కసారిగా పేలి... ప్రమాదం జరిగింది.

rtc bus tire explosion at gannavaram
గన్నవరం వద్ద ఆర్టీసీ బస్సు ప్రమాదం

By

Published : Apr 7, 2021, 10:32 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం వద్ద ఆర్టీసీ బస్సు టైరు‌ పేలిపోయింది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఏలూరు నుంచి విజయవాడ వెళ్తున్న బస్సు టైరు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఒక్కసారిగా పంక్చర్ అయ్యింది.

ఇద్దరికి తీవ్రగాయాలు కాగా... మరికొంత మంది స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 28 ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details