flight delayed విజయవాడ నుంచి దిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 9గంటల15నిమిషాలకు విజయవాడ నుంచి ఎయిరిండియా విమానం దిల్లీ బయలుదేరాల్సి ఉంది. నిర్ణీత సమయానికి విమానం విజయవాడ చేరుకోలేదు. 10గంటల15నిమిషాలైనా విమానం రాకపోకలపై తామేమీ చెప్పలేమని సిబ్బంది పేర్కొనడంతో ప్రయాణీకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దిల్లీ చేరుకుని అక్కడ నుంచి విదేశాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు మరింత ఆందోళన చెందుతున్నారు. దిల్లీలో బయలుదేరాక సాంకేతి సమస్య తలెత్తడంతో వెనక్కి వెళ్లినట్లు తెలిసింది. ఈ విమానంలో 178 మంది ప్రయాణికులు దిల్లీ నుంచి విజయవాడకు వస్తున్నట్లు సమాచారం.
దిల్లీ వెళ్లాల్సిన విమానం ఆలస్యం, ప్రయాణికుల్లో ఆందోళన - విమానం ఆలస్యం
flight delayed విజయవాడ నుంచి దిల్లీ వెళ్లాల్సిన విమానం ఆలస్యం అయింది. 9గంటల15 నిమిషాలకు రావాల్సిన విమానం 10గంటల15 నిమిషాల వరకు రాలేదని ప్రయాణికులు తెలిపారు. ఫలితంగా దిల్లీ నుంచి విదేశాలకు వెళ్లాల్సిన విమానాల్ని అందుకోవడం ఆలస్యం అవుతుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.
![దిల్లీ వెళ్లాల్సిన విమానం ఆలస్యం, ప్రయాణికుల్లో ఆందోళన Flight Late](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16191932-856-16191932-1661407420873.jpg)
విమానం ఆలస్యం