Parents Suicide: ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చిన నందిగామకు చెందిన ఆరేపల్లి సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులు. వారి కుమారుడు జగదీశ్ కొద్ది రోజుల క్రితం ట్రాక్టర్ ప్రమాదంలో కన్నుమూశాడు. దీంతో.. తమ కంటి వెలుగు శాశ్వతంగా దూరమైందని.. అప్పటి నుంచి జగదీశ్ తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ఎంత ప్రయత్నించినా.. కుమారుడి మరణాన్ని జీర్ణించుకోవడం సాధ్యం కాలేదు. కొడుకు లేని లోకంలో తాము ఉండలేమంటూ.. ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒకే చీరకు ఇద్దరూ ఉరి బిగించుకుని ఆదివారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
"కన్నా.. నువ్వులేని లోకంలో ఉండలేమురా.." తల్లిదండ్రుల దారుణ నిర్ణయం! - ఉరివేసుకుని తల్లిదండ్రుల ఆత్మహత్య
Parents Suicide: కొద్దిరోజుల క్రితమే వారి కుమారుడు ప్రమాదంలో కన్నుమూశాడు. కుమారుడి మీదే ఆశలు పెట్టుకున్న ఆ తల్లిదండ్రులు.. తమ పుత్రుడు ఇక లేడన్న నిజాన్ని జీర్ణించుకోలేక పోయారు. కొడుకులేని లోకంలో తాము ఉండలేమంటూ.. ఇద్దరూ ఉరేసుకుని ఊపిరితీసుకున్నారు. ఈ విషాద ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది.
Parents Suicide