పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదని విజయవాడలో వాపోయారు. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే ఒప్పంద ఉద్యోగస్తుల సర్వీసులను వెంటనే క్రమబద్దీకరించాలని కోరారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ను వెంటనే ఇవ్వాలన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థను బలోపేతం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు . ప్రభుత్వ పరంగా తీసుకునే అన్ని కార్యక్రమాలకు ఉద్యోగులు అండగా ఉంటారని పేర్కొన్నారు.
సమస్యలు పరిష్కరించండి: పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం - ycp
ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు 27శాతం ఐఆర్‌ను వెంటనే ఇవ్వాలని పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. పంచాయతీ రాజ్‌లోని ఒప్పంద ఉద్యోగస్తులను క్రమబద్దీకరించాలని విజ్ఞప్తి చేసింది.
సమస్యలు పరిష్కరించండి: పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం