ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి: గిరిజాశంకర్‌

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌ అన్నారు. నాలుగోదశ ఎన్నికల్లో 82.85 శాతం పోలింగ్ నమోదు కాగా.. మెుత్తం నాలుగు దశల్లో కలిపి 81.78 శాతం ఓటింగ్ రికార్డ్ అయినట్టు తెలిపారు.

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి

By

Published : Feb 21, 2021, 8:52 PM IST

Updated : Feb 22, 2021, 12:22 AM IST

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్‌ చెప్పారు. కలెక్టర్లు, జేసీలు, జడ్పీ సీఈవోలు సమర్థంగా పనిచేశారని కొనియాడారు. నాలుగో దశ ఎన్నికల్లో 82.85 శాతం పోలింగ్ నమోదైందని.. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09 శాతం.. అత్యల్పంగా నెల్లూరులో 76 శాతం నమోదైందని వెల్లడించారు.

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి

'పంచాయతీ ఎన్నికలు 4 దశలు కలిపి మెుత్తం 81.78 శాతం పోలింగ్ నమోదైంది. 4 దశల్లో 2,197 పంచాయతీలు, 47,459 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 10,890 పంచాయతీలు, 82,894 వార్డులకు ఎన్నికలు నిర్వహించాం. ఎన్నికల్లో 2.26 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 10 పంచాయతీలు, 670 వార్డులకు నామినేషన్లు రాలేదు. వాటిపై ఎస్ఈసీకి నివేదించి చర్యలు తీసుకుంటాం' అని గిరిజాశంకర్ తెలిపారు.

జిల్లాల వారీగా నమోదైన పోలింగ్​ శాతం:

విజయనగరం జిల్లాలో 87.09 శాతం, విశాఖపట్నం-86.94, శ్రీకాకుళం-83.59, తూర్పు గోదావరి-80.30, పశ్చిమ గోదావరి-83.76, కృష్ణా-85.64 , గుంటూరు-84.92, ప్రకాశం-82.04, నెల్లూరు-76, చిత్తూరు-78.77, కడప-85.13, కర్నూలు-78.41, అనంతపురం జిల్లాలో 84.49 శాతం పోలింగ్ నమోదైంది.

ఇదీ చదవండి:

పల్లె పోరు: తుది విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Last Updated : Feb 22, 2021, 12:22 AM IST

ABOUT THE AUTHOR

...view details