కృష్ణా గన్నవరం మండలం కేసరపల్లిలో.. పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ పర్యటించారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై.. కమిషనర్ ఆరా తీశారు. పంచాయతీలకు ఆదాయ పెంపు వనరులపై.. సిబ్బందికి గిరిజాశంకర్ పలు సూచనలు చేశారు. దిశ యాప్, కరోనా నివారణ చర్యల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో జాప్యం నెలకొన్న స్థానిక సచివాలయం-1ను రెండుగా విభజించాలని పలువురు నేతలు కోరారు.
Girija Shankar: 'దిశ యాప్, కరోనా నివారణ చర్యల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి' - కేసరపల్లిలో పంచాయతీ రాజ్ కమిషనర్ గిరిజాశంకర్ పర్యటన వార్తలు
దిశ యాప్, కరోనా నివారణ చర్యల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో పర్యటించిన ఆయన.. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలపై ఆరా తీశారు.
![Girija Shankar: 'దిశ యాప్, కరోనా నివారణ చర్యల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి' panchayat raj commissioner girija shankar visits kesarapally at krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12603448-356-12603448-1627485114080.jpg)
దిశ యాప్, కరోనా నివారణ చర్యల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి: గిరిజా శంకర్