ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'విద్యా కమిటీ ఛైర్మన్లతో జాతీయ జెండా ఆవిష్కరణ ఆదేశాలు సరికాదు'

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్లు జెండాను ఆవిష్కరించాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు తప్పుపట్టారు. నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.

స్వాతంత్య్ర దినోత్సవం
స్వాతంత్య్ర దినోత్సవం

By

Published : Aug 14, 2021, 4:06 PM IST

స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలతోనే జాతీయ జెండాను ఎగురవేయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. పాఠశాల విద్యా కమిటీ ఛైర్మన్లతో జెండా ఎగుర వేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు.. 73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టానికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వ అనాలోచిత జీవోలే కనుక అమలైతే సర్పంచులు, ఎంపీటీసీలు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోతారని దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాజేంద్ర ప్రసాద్​ డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details